- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Adipurush 8 రోజుల వసూళ్లు ఇవే...
దిశ, వెబ్డెస్క్ : ప్రభాస్ ఆదిపురుష్ సినిమా 8 రోజుల వసూళ్లు ఎంతో తెలుసా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రోజురోజుకు తగ్గిపోతూ వస్తున్నాయి. ఏపీ తెలంగాణలో మొదటి రోజు 32 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇక మొత్తంగా ఏడవ రోజు చూసుకుంటే ఈ సినిమాకు 97 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఎనిమిదవ రోజు అంతకంటే తక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల షేర్ మాత్రమే దక్కింది. ఇక మొత్తంగా ఎనిమిది రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 రోజుల్లో ఆదిపురుష్ సినిమాకు 75.92 కోట్ల షేర్ కలెక్షన్స్ 121 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఇక కర్ణాటకలో 11.82 కోట్లు రాగా తమిళనాడులో చాలా తక్కువగా 2.34 కోట్ల షేర్ వచ్చింది. ఇక కేరళలో అయితే మరింత దారుణంగా కేవలం 84 లక్షల షేర్ మాత్రమే దక్కించుకుంది. ఇక హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 65.35 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో ఇప్పటివరకు ఈ సినిమా 23.60 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో ఆదిపురుష్ సినిమా 179.87 కోట్ల షేర్ కలెక్షన్స్ 363 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. మూవీ ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసింది. ఇక 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో వచ్చిన ఆదిపురుష్ సినిమా తప్పకుండా ఆ టార్గెట్ ను తొందరగానే ఫినిష్ చేస్తుందా అని అనుకున్నారు.
కానీ ఈ సినిమా అంచనాలనుకు భిన్నంగా ఇప్పటివరకు కనీసం 200 కోట్లను కూడా టచ్ చేయలేకపోయింది. ఇంకా సినిమా ప్రాఫిట్ లోకి రావాలి అంటే 60 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అయితే రావాలి. ఇక ఈ వీకెండ్ మాత్రమే సినిమాకు చివరి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ ఆదివారాల రోజు ఏదైనా వస్తేనే సినిమా నష్టాల నుంచి కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇక మరో సోమవారం వస్తే మాత్రం సినిమా దాదాపు చాలా ఏరియాలో నుంచి తీసేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆదిపురుష్ సినిమా ఈ రెండు రోజుల్లో ఇంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.