కేసీఆర్ టూర్.. నేతల ముందస్తు అరెస్ట్ షురూ

by  |
కేసీఆర్ టూర్.. నేతల ముందస్తు అరెస్ట్ షురూ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో అరెస్టుల పర్వం మొదలైంది. నియోజకవర్గంలోని పలు చోట్ల బీజేపీ నాయకులను స్టేషన్లకు తరలించిన పోలీసులు కస్టడీలో పెట్టారు. అయితే కొన్ని చోట్ల బీజేపీ నాయకులు తమను ఎందుకు అరెస్ట్ చేశారంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో హుజురాబాద్ స్టేషన్ ఆవరణలో బీజేపీ నాయకులు బైఠాయించారు. సామన్యులను అరెస్ట్ చేసి సీఎం టూర్ నిర్వహించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ఆయా పోలీస్ స్టేషన్లలో సుమారు వంద మంది వరకు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story