అది ప్రారంభమైంది.. మీరు తొందరగా వెళ్లిపోవొచ్చు

by  |
అది ప్రారంభమైంది.. మీరు తొందరగా వెళ్లిపోవొచ్చు
X

దిశ, వెబ్ డెస్క్: వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్​ఆర్​డీపీ)లో భాగంగా మరో ప్రాజెక్టు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రూ.26.45 కోట్లతో బైరామల్​గూడ జంక్షన్​లో నిర్మించిన ఫ్లైఓవర్​ను నేడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఎస్​ఆర్​డీపీ ప్యాకేజీ–2లో భాగంగా రూ. 448 కోట్ల వ్య‌యంతో పనులను 14 పనులను చేపట్టడగా.. బైరామల్​గూడ ఫ్లైఓవర్​తో కలిపి ఆరు పనులు పూర్తయ్యాయి. ఇతర పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

ఈ ఫ్లైఓవర్​పై మూడు లైన్లతో ఒన్​ సైడ్​ వేలో వాహనాలు ప్రయాణిస్తాయి. ఫ్లైఓవర్​ అందుబాటులోకి వచ్చినందున సాగ‌ర్‌రోడ్ జంక్షన్​పై ఒత్తిడి త‌గ్గుతుండంతో పాటు సికింద్రాబాద్​ నుంచి ఓవైసీ ఆస్పత్రి వైపు వచ్చే రూట్​లో ట్రాఫిక్​ రద్దీ తగ్గనున్నది. ఇంధన ఆదా, ప్రయాణ సమాయం మిగులనున్నది. ఇండియాలో మొదటిసారిగా కొత్త టెక్నాలజీతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్​ ప్రమాదాల తీవ్రతను తగ్గించేలా రూపొందించారు. 2015లో పీక్​ అవర్​లో ఈ రూట్​లో 7,481 పీసీయూలు ప్రయాణిస్తుండగా.. 2034 నాటికి వీటికి సంఖ్య 18,653కు చేరనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.



Next Story

Most Viewed