రూ. 2 లక్షల్లోపు బంగారం కొనుగోలుకు కేవైసీ అక్కరలేదు!

by  |
రూ. 2 లక్షల్లోపు బంగారం కొనుగోలుకు కేవైసీ అక్కరలేదు!
X

దిశ, వెబ్‌డెస్క్: రూ. 2 లక్షల్లోపు నగదు చెల్లించి బంగారం, వెండి, ఆభరణాలు, రత్నాలను కొనుగోలు చేసేవారు తప్పనిసరి కేవైసీ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధిక మొత్తంలో నగదు లావాదేవీలకు మాత్రమే పాన్, ఆధార్ లాంటి ధృవపత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని 2020, డిసెంబర్ 28న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ తెలిపింది. బంగారం, ఆభరణాలు, విలువైన రత్నాలను రూ. 2 లక్షలకు మించి ఎక్కువ నగదు ఇచ్చి కొనాలంటే కేవైసీ ఇవ్వాల్సిందే. అవినీతి నిరోధక చట్టం 2002 ప్రకారం.. రూ. 10 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తంతో బంగారం, వెండి, ఆభరణాలు, రత్నాల వంటి విలువైన వాటిని కొనే వ్యక్తులు లేదంటే సంస్థలు కేవైసీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.


Next Story