అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఆన్‌లైన్ కిరాణా

by  |
అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఆన్‌లైన్ కిరాణా
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ నుంచి అమెజాన్ వరకు ఈ-కామర్స్ కంపెనీలు ఆన్‌లైన్ కిరాణా సేవలను అందించేందుకు పోటీ పడుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ కిరాణా సేవలు రానున్న రోజుల్లో అతిపెద్ద వ్యాపార కేంద్రంగా మారనుందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. 2024 నాటికి ఆన్‌లైన్ కిరాణా సేవల మార్కెట్ సుమారు రూ. 1.31 లక్షల కోట్లకు విస్తరిస్తుందని బెంగళూరుకు చెందిన రెడ్‌సీర్, బిగ్‌బాస్కెట్ సంయుక్త నివేదిక తెలిపింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఏడాది జనవరితో పోలిస్తే జూన్‌లో స్థూల వస్తువుల విలువ(జీఎంవీ) 1.7 రెట్లు పెరిగిందని నివేదిక పేర్కొంది.

ఆన్‌లైన్ కిరాణా విభాగం ప్రస్తుత ఏడాది చివరి వరకు సగటున సుమారు రూ. 21.9 వేల కోట్లతో స్థిరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. పరిశ్రమ గత త్రైమాసికంలో వార్షికాదాయం 70 శాతం వరకు పెరిగింది. ఇది ఎక్కువ సంఖ్యలో వినియోగదారులకు చేరువకావడానికి అవకాశాలనిస్తుంది. అలాగే, పలు సవాళ్లను కూడా ఈ పరిస్థితులు కల్పించే అవకాశముందని బిగ్‌బాస్కెట్ సీఈవో హరి మీనన్ చెప్పారు.

నూడుల్స్, కుకీల వంటి ఈజీ ఫుడ్స్, రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులు, శానిటైజర్స్ వంటి పరిశుభ్రత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందీని ఆయన తెలిపారు. కరోనాకు ముందు వరకూ స్నాక్స్, బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులు 5 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేయగా, కరోనా తర్వాత జూన్ త్రైమాసికంలో వృద్ధి 75 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది.

Next Story

Most Viewed