ఉద్యోగాల పేరుతో దందా.. కేంద్ర మంత్రికి వినతి

by  |
ఉద్యోగాల పేరుతో దందా.. కేంద్ర మంత్రికి వినతి
X

దిశ, గోదావరిఖని : ఆర్.ఎఫ్.‌సీఎల్‌జెఏసీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జ్యోతి భవన్‌లో కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రి భగవంత్ కుబాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, బాధ్యులు మాట్లాడుతూ.. గత ఎఫ్ సీఐ‌లో నష్టపోయిన మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు అదే స్థానంలో పునర్నిర్మాణం అయిన ఆర్.ఎఫ్.‌సీఎల్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ పాలకులు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, పైగా ఉద్యోగాల పేరుతో అక్రమ దందా కొనసాగుతోందన్నారు.

ఆర్.ఎఫ్.‌సీఎల్‌లో పనిచేసిన మాజీ కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది ఆకలి చావులకు గురై చనిపోయిన పరిస్థితి కూడా ఉందని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఆర్.ఎఫ్.సీఎల్ యాజమాన్యానిదని పేర్కొన్నారు. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, కొంతమంది దళారులు ఉద్యోగాల పేరుతో అక్రమ దందా కొనసాగిస్తున్నటికీ ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంట్రాక్టర్లు మారిన కార్మికులు మారకుండా తగు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఉద్యోగాల పేరుతో కొనసాగుతున్న దందాలను తక్షణమే అరికట్టి మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎఫ్.‌సీఎల్‌ జేఏసీ కో కన్వీనర్, ఐఎఫ్ టీ యూ ప్రధాన కార్యదర్శి తోకల రమేష్, జెఏసీ సభ్యులు, ఐఎఫ్ టీయూ అధ్యక్షులు, ఇనుగాల రాజేశ్వర్, జెఏసీ సభ్యులు శనగలశ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed