రెండు రోజుల్లో రాబోతున్న OnePlus కొత్త ఫోన్.. ఫీచర్స్ ఇవే!

253
one plus

దిశ, వెబ్‌డెస్క్: వన్ ప్లస్ సంస్థ నుంచి కొత్త ఫోన్ రానుంది. OnePlus 9RT ఫోన్‌ ఇండియాలో జనవరి 14, 2022న ప్రారంభించబడుతుందని కంపెనీ పేర్కొంది. ఇంతకుముందు ఇది చైనాలో విడుదల అయింది. భారత్‌లో సందడి చేయడానికి ఈ నెల లాంచ్ కానుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1080×2400 పిక్సెల్,1300 nits బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్, 600Hz టచ్ రెస్పాన్స్‌తో, 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లేతో గొరిల్లా గ్లాస్‌ను కలిగి ఉంది. ఫోన్ Adreno 660 GPUతో Qualcomm Snapdragon 888 చిప్‌సెట్ ద్వారా Android 11పై పనిచేస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌‌ను కలిగి ఉంది.దీనిలో 50MP ప్రధాన కెమెరా, 16MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందు భాగంలో 16MP కెమెరా అమర్చారు. USB టైప్-C, 65T చార్జింగ్ టెక్నాలజి, 65W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 8GB RAM 128GB ధర రూ.38,500, 8GB RAM 256GB ధర రూ.40,900. 12GB RAM 256GB ధర రూ.44,400. హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో OnePlus లోగోతో దీర్ఘచతురస్రాకార కటౌట్ ఉంటుంది.

one plus2

one plus3