పోలీసు దెబ్బలకు ఒక వ్యక్తి మృతి

955

దిశ, మానకొండూరు: పోలీసు దెబ్బలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. కొందరు పేకాట ఆడుతున్నారని బెజ్జంకి ఎస్సై చంద్రశేఖర్‌కు గత బుధవారం సమాచారం అందింది. దీంతో దాడి చేసి కొందరు జూదరులను ఆయన అరెస్టు చేశారు. కాగా వారిలో బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన రంగ వేని శ్రీనివాస్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అయితే బెజ్జంకి ఎస్ఐ చంద్రశేఖర్ ఇష్టం వచ్చినట్టు కొట్టడంతోనే శ్రీనివాస్ అపస్మారక స్థితికి చేరుకున్నారని అతని బంధువులు అన్నారు. కాగా చికిత్స కోసం కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించగా వెంటిలెటర్ ద్వారా అతనికి ట్రీట్ మెంట్ చేస్తున్నామని డాక్టర్లు చెప్పారని వారు అన్నారు. అయితే ఉన్నట్టుండి ఆదివారం సాయంత్రం వెంటిలెటర్ తీసేసి శ్రీనివాస్ మరణించాడని డాక్టర్లు చెప్పినట్టు వారు తెలిపారు. పోలీసులు, డాక్టర్లు కుమ్మక్కై శ్రీనివాస్ మరణంపై కథలు చెప్తున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్ సీపీ కార్యాలయంలో శ్రీనివాస్ భార్య లక్ష్ష్మీ ఫిర్యాదు చేసింది.