అలా జరుగుతదని ఆ కుటుంబ సభ్యులు ఊహించలేదు..

by  |
అలా జరుగుతదని ఆ కుటుంబ సభ్యులు ఊహించలేదు..
X

దిశ, మహబూబ్ నగర్: రాత్రి వరకు వారందరూ ఆనందంగా గడిపారు. కానీ, అందులో ఒకరు మాత్రం మరుసటి రోజు తెల్లవారు జామున ఊహించని విధంగా కనిపించాడు. దీంతో వారంతా లబోదిబోమంటూ కన్నీరుమున్నీరయ్యారు. విషయమేమిటంటే.. జోగులాంబా గద్వాల జిల్లాలోని ఐజా మండలం గుడిదొడ్డి గ్రామంలో వీరా రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి వరకూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన వీరారెడ్డి తెల్లవారు జామున ఇంటి సమీపంలో శవమై కనిపించాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భార్య, కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Next Story

Most Viewed