డీసీఎం బోల్తా.. వలస కూలీ మృతి

by  |
డీసీఎం బోల్తా.. వలస కూలీ మృతి
X

దిశ, నిజామాబాద్: వలస కూలీలపై మయాదారి రోగం కరోనా కరుణించినప్పటికీ, కాలం కత్తిగట్టింది. ఉన్నకాడా పని చేసుకోలేని పరిస్థితుల్లో సొంతూరుకు వెలుతుంటే రోడ్డు ప్రమాద రూపంలో వారిని వెంటాడింది. లాక్‌డౌన్ కారణంగా జార్ఖండ్, మహారాష్ర్టకు చెందిన 21 మంది వలస కూలీలు హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. తమ ప్రాంతాలకు వెళ్లి కలో గంజో తాగి బతుకుదామని మంగళవారం డీసీఎంలో వెళ్లుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా , 20 మంది గాయాపడ్డారు. వివరాళ్లోకి వెళితే.. మంగళవారం హైదరాబాద్ నుంచి వలస కార్మికులు మహారాష్ట్ర, ఝార్ఖండ్ వెళ్తుండగా జాతీయ రహదారి 44 పైన కామారెడ్డి జిల్లా దగ్గి వద్ద డీసీఎం వ్యాన్ టైర్ పేలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లో ఒకరు చనిపోగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 20 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు 108 అంబులెన్సుల ద్వారా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed