మేనకోడలి కోసం సైకిల్‌పై వంద కిలోమీటర్ల ప్రయాణం

by  |
మేనకోడలి కోసం సైకిల్‌పై వంద కిలోమీటర్ల ప్రయాణం
X

తెలుగు లోగిళ్లలో ఆడబిడ్డలకు తల్లి తరువాతి తల్లి మేనమామ అన్న విషయం అంతా అంగీకరిస్తారు. తోబుట్టువులైతే తండ్రి తరువాతి తండ్రిగా గౌరవిస్తారు. తోబుట్టువుకు ఆడపిల్ల పుడితే మేనకోడలిని చూసేందుకు వందకిలోమీటర్ల దూరం సైకిల్‌పై ప్రయాణించాడో వ్యక్తి. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం గ్రామానికి చెందిన ధర్మవరపు సురేష్ పలాస మండలంలోని రామకృష్ణాపురం వద్దనున్న ఇటుకల క్వారీలో పని చేస్తున్నాడు.

తోబుట్టువు దుర్గకు ప్రసవ సమయం దగ్గర పడుతున్న సమయంలో డెలివరీకి అవసరమైన నగదు, సరకులు తీసుకుని రావాలనుకున్నాడు. ఇంతలో కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీంతో అక్కడే ఉండిపోయాడు. నిన్న దుర్గ శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ మేనమామ ఘడియల్లో పుట్టిందని, మంగళవారం నాటికి చూడకుంటే.. ఐదేళ్ల వరకు పాపను చూసేందుకు వీళ్లేదని పెద్దలు చెప్పారు. దీంతో మేనకోడలిని చూసేందుకు సురేష్ ఇటుకల క్వారీ నుంచి సైకిల్‌పై బయల్దేరాడు. శ్రీకాకుళం చేరుకుని మేనకోడలిని చూసి మురిసిపోయాడు.

Tags: srikakulam district, ranastalam, palasa, drive cycle 100 miles, uncle, daughter-in-law

Next Story

Most Viewed