ఖమ్మం జిల్లాలో విషాదం.. పత్తి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

by  |
tractor accident
X

దిశ, పాలేరు: ముదిగొండ మండలం వల్లభి గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గుగులోత్ అనిత(36) అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కాగా పత్తి కూలికి 20 మంది మహిళలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ కూలీలంతా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన వారు. బుధవారం ఉదయం తమ గ్రామం నుంచి పెద్దామండవ గ్రామానికి చెందిన రైతు చింతల అప్పారావుకు చెందిన చేనులో పత్తి తీసేందుకు వెళ్తుండగా వల్లభి గ్రామ సమీపంలో ఈ ఘటన ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed