‘వ్యాక్సిన్ స్ట్రాటజీ నోట్లరద్దు వంటిదే ’

by  |
Rahul Gandhi
X

న్యూఢిల్లీ : దేశంలో 18 ఏళ్లు నిండినవారికి మే 1 నుంచి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రకటించిన కేంద్రప్రభుత్వ నిర్ణయం మరో నోట్లరద్దు వంటిదేనని రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా మోడీ సర్కారు ప్రకటించిన వ్యాక్సిన్ స్ట్రాటజీపై కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహం మరో నోట్లరద్దుకు ఏమాత్రం తక్కువ కాదు. దీంతో ప్రజలు మళ్లీ రోడ్ల మీదకు వచ్చి క్యూ లైన్లలో నిల్చుంటారు. డబ్బు, ఆరోగ్యం, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది. చివరికి కొద్దిమంది పారిశ్రామికవేత్తలే దీనిద్వారా లాభం పొందుతారు..’ అని ట్వీట్ చేశారు.

2016లో మోడీ సర్కారు ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా ఏటీఎంల ముందు వేలాది మంది ప్రజలు క్యూలైన్లలో నిల్చున్న విషయం తెలిసిందే. కాగా నోట్లరద్దు నిర్ణయాన్ని మొదటి నుంచి విమర్శిస్తున్న వారిలో రాహుల్ గాంధీ కూడా ఒకరు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చినప్పుడల్లా ఆయన నోట్లరద్దు, జీఎస్టీ వంటివాటిని ప్రస్తావిస్తారు.

Next Story

Most Viewed