- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. మూడో పాజిటివ్ కేసు నమోదు

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ టెన్షన్ కొనసాగుతోంది. దేశంలో 360కి పైగా కేసులు నమోదు అయ్యాయి. కాగా, ఏపీలో శుక్రవారం మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని అయినవిల్లి మండలం నేదునూరులో ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు మహిళ ఈనెల 19న కువైట్ నుంచి విజయవాడ వచ్చినట్టు సమాచారం.
ఈ సందర్భంగా అదనపు డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ఒమిక్రాన్ సోకిన మహిళను హోమ్ ఐసొలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. మహిళ భర్తకు, పిల్లలకు పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ వచ్చినట్టు వెల్లడించారు. అయినప్పటికీ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
- Tags
- ap
Next Story