ఒమిక్రాన్ డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 10,000 కేసులు నమోదు

by Anukaran |
Omicron Danger Bells
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ప్రపంచ దేశాలను కొత్త వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ యూకేను కుదిపేస్తోంది. రోజురోజుకు భయంకరంగా కేసులు పెరుగుతూ అక్కడి ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా.. యూకేలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక్కరోజే పదివేల కేసులు నమోదయ్యాయి. అలాగే ఒమిక్రాన్ మరణాల సంఖ్య 7కు చేరింది. అంతకుముందు రోజు 3,201 ఒమిక్రాన్ కేసు నమోదు కాగా, ఇవాళ మూడు రెట్లు పెరిగి పదివేలు నమోదు కావడం ఆ దేశ ప్రజలను భయబ్రాంతులకు చేరిచేస్తోంది. ప్రస్తుతం యూకే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968కు చేరింది. అంతేగాకుండా.. ఇప్పటికే దాదాపు 95 దేశాలకు పాకిన ఈ మహమ్మారి భారత్‌లోనూ క్రమ క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.

Next Story

Most Viewed