మనీ కోసం పింఛన్ దారుల ఎదురు చూపులు

by  |

దిశ, మెదక్ : రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో డబ్బుల కోసం పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లితో పాటు పాలు గ్రామాల్లో వృద్ధులు, వికలాంగులు పేమెంట్ బ్యాంకు మర్చంట్‌ల వద్ద నగదు తీసుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు. దీనికి తోడు బ్యాంకుల వద్ద సర్వర్ రాకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.ఓ వైపు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన, ఆసరా పింఛన్‌లతో పాటు వివిధ రకాల లావాదేవీలు జరిపేందుకు ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ ప్రాబ్లమ్ వలన ఇతర గ్రామాల్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలన్నా కరోనా ప్రభావం వలన ఆటోలు, బస్సులు తిరగకపోవడం లేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు ఆసరా పింఛన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కనీసం నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని పింఛన్ దారులు చెబుతున్నారు.

Tags: penshion, old womens and mens, waiting, medak, phc, asara pension



Next Story

Most Viewed