వైరల్ వీడియో : ఉయ్యాలపై తాత స్టంట్లు.. ఫిదా అవుతున్న నెటిజన్లు

by  |
వైరల్ వీడియో : ఉయ్యాలపై తాత స్టంట్లు.. ఫిదా అవుతున్న నెటిజన్లు
X

దిశ,వెబ్‌డెస్క్: ఓ వృద్ధుడు పార్క్ లో ఉయ్యాల ఊగుతున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో 70 ఏళ్ల వృద్ధుడు పార్క్ నుంచి వెళుతుండగా.., పిల్లలు ఊగుతున్న ఉయ్యాలను చూశాడు. అంతే తన చిన్ననాటి జ్ఞాప‌కాలు త‌న మ‌దిలో మెదిలినట్లున్నాయి. క్షణం ఆలస్యం చేయకుండా ఉయ్యాల ఊగేందుకు ప్రయత్నించాడు. ఉయ్యాల ఊగుతూ తెగ సంబరపడిపోయాడు. తాత హుషారుకి వేగం సరిపోలేదేమో మెల్లి మెల్లిగా ఉయ్యాల వేగాన్ని పెంచాడు. అలా వేగంగా ఊగుతున్న ఉయ్యాలను ఒక్కసారిగా రివర్స్ చేస్తూ ఆగిపోతాడు. వృద్ధుడు చేసిన ఫీట్ పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో ఇలాంటి ప్రయోగం చేయడం చాలా విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed