‘ఆసరా’కోసం ఎదురుచూపులు!

by  |
‘ఆసరా’కోసం ఎదురుచూపులు!
X

టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆసరా పింఛన్లు వస్తాయని సంబురపడ్డారు. రెండేళ్లుగా గీత, చేనేత, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు నిరీక్షిస్తున్నారు. కాటికి కాళ్లు చాపిన వయస్సులో పండుటాకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆసరా పింఛన్ల మాటెత్తడం లేదు. రెండేళ్లుగా కొత్త దరఖాస్తులకు మోక్షం లేదు. జిల్లాలో కొత్త దరఖాస్తులు 12,680 పెండింగ్ లో ఉన్నాయి. పింఛన్ అర్హత వయస్సు తగ్గింపు ఊసే లేదు.ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని 57ఏళ్ల వయసు ఉన్నవారిని 31,947 వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దిశ ప్రతినిధి, రంగారెడ్డి :

ఎన్నికలకు ముందు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు హామీల వర్షం కురిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చే సేందుకు తిరకాసు పెడతాయి. మళ్లీ ఎన్నికలు వచ్చే ముందు హడావిడి చేస్తాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిస్థితి కూడా అలానే ఉంది.ఎన్నికల ముందు పింఛన్ అర్హత వయస్సు తగ్గించి అర్హులందరికీ ఇస్తామని హామీ ఇచ్చింది. రెండో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. కొత్త దరఖాస్తుల ఊసే ఎత్తడం లేదు.దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.

జిల్లాలో 12,280 మందికి ..

రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,69,688 మంది ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. అర్హత కలిగిన గీత, చేనేత, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు మొత్తం 12,280 కొత్త దరఖాస్తు వచ్చాయి. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. పింఛన్ మాత్రం రావడం లేదు. సుమారుగా రెండేం డ్లుగా లబ్ధిదారులు కోసం ఎదురుచూస్తున్నారు. కాటికి కాళ్లు చాపిన వయస్సులో పింఛన్ వస్తే కొంచెం ఆసరాగా ఉంటుందని భావిస్తుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పెం చిన పింఛన్ ను జీవో ప్రభుత్వం 2016న విడుదల చేసింది. అమలు మాత్రం 2019 జూ న్ నుంచి చేస్తుంది.

వయస్సు తగ్గింపు ఊసేలేదు..

టీఆర్ఎస్ ఎన్నికల ముందు పింఛన్ వయస్సు 57 ఏళ్లకు తగ్గించి అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని ప్రకటించింది. పింఛన్ వస్తదని ముసలోళ్లు సంబుర పడ్డారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకున్నది లేదు. 65 సంవత్సరాలు పైబడిన వారు కొత్తగా దర ఖాస్తు చేసుకున్నా పరిశీలించడం లేదు. ఓటరు జాబి తాను ప్రామాణికంగా తీసుకుని 57ఏళ్ల వయసు ఉన్నవారిని 31,947 వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించి నివేదిక రూపొందించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆ జాబితా పక్కన పెట్టింది. పింఛన్ వస్తదని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఏడాదిన్నరైంది..

పింఛన్ కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటి వరకూ అతీ గతి లేదు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. పింఛన్ కోసం ఎదురు చూసి కళ్లు కా యలు కాశాయి. మా ఆయన చనిపోయి రెండేళ్లయింది.పింఛన్ వస్తే కుటుంబం గడుస్తుదని చూస్తున్నా..

–పాశం లక్ష్మమ్మ, వితంతు,మొహబత్ నగర్

అర్హతలున్నా ఆసరా రాకపాయే..

నాకున్న ఆధార్ కార్డు ఆధారంగా పింఛన్ కు దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటి వరకు రాలేదు. మాకు భూమి, ఇళ్లు లేదు. దరఖాస్తు చేసుకోని రెండు సంవత్సరాలైంది. ఇంకెన్నాళ్లు ఫించన్ల కోసం ఎదురుచూడాలి. ఇస్తే ఇస్తామయో… లేకపోతే లేదు అంటే అయిపాయో.

-నేనావత్ పుల్యా నాయక్, మహేశ్వరం

Next Story

Most Viewed