ఆదేశాలను ఉల్లంఘిస్తే పాఠశాలల గుర్తింపు రద్దు

by  |
ఆదేశాలను ఉల్లంఘిస్తే పాఠశాలల గుర్తింపు రద్దు
X

దిశ, మెదక్: కరోనా వైరస్ నేపథ్యంలో ఏప్రిల్ 7 నుంచి నిర్వహించనున్న ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశానుసారం 7 నుంచి 9వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్ పద్ధతిలో, వామ్రావ్‌లో వార్షిక పరీక్ష పత్రాలను పంపి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని కరోనా నేపథ్యంలో ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించినట్టు అవుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలను నిర్వహించకూడదని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన ప్రవేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.

Tags : Officials, schools, suspended, violate, government orders, madak, DEO

Next Story