వెంకీతో ఇబ్బందులు పడుతున్న Rana Daggubati.. ట్వీట్టర్‌లో పోస్ట్

394

దిశ, సినిమా : విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌‌గా రానున్న వెబ్‌సిరీస్‌లో కలిసి నటించబోతున్నారు బాబాయి అబ్బాయిలు. ఈ సిరీస్‌కు ‘రానా నాయుడు’ టైటిల్ ఫైనలైజ్ కాగా అమెరిన్ డ్రామా సిరీస్ ‘రే డొనొవన్’ ఇండియన్ అడాప్టేషన్‌గా రాబోతోంది. కరణ్ అన్షుమన్, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించనునన్న ఈ క్రైమ్ డ్రామాలో ప్రొఫెషనల్ ఫిక్సర్‌గా కనిపించబోతున్నాడు రానా. సెలబ్రిటీ క్లైంట్స్‌ను కాపాడేందుకు లంచాలు, బెదిరింపులు, ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు పాల్పడే అతను.. తండ్రి(వెంకీ) జైలు నుంచి విడుదలయ్యాక ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అనేది కథ. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన రానా.. బాబాయితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే తన కల ఇప్పటికి నెరవేరిందన్నాడు. కాగా.. ‘రానా నాయుడు’ ఫస్ట్ లుక్‌లో రానా, వెంకీల లుక్‌ డిఫరెంట్‌గా ఉండగా.. ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.