ఆ హైవేకు లైన్ క్లియర్

by  |
supreme court
X

న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రంలో చెన్నై-సేలం జాతీయ రహదారి నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ చేపట్టడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకం కింద చెన్నై నుంచి సేలంకు మధ్య 277 కి.మీ. పొడవున ఎనిమిది లైన్ల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రచించారు.

ఇందుకోసం రూ.10,000కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. చెన్నై, సేలం మధ్య ప్రయాణ సమయం తగ్గించడం జాతీయ రహదారి నిర్మాణ ముఖ్యోద్దేశం. రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 6గంటల నుంచి 3గంటల వరకు తగ్గుతుంది. జాతీయ రహదారి నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణను మద్రాస్ హైకోర్టు గత ఏడాది రద్దు చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సవాల్ చేయగా భూసేకరణకు అనుమతి ఇచ్చింది.



Next Story

Most Viewed