ఆ బ్యాంక్ ఖాతాదారులకు గమనిక.. అక్టోబర్ 1 నుంచి చెక్ బుక్స్ పనిచేయవు..

by  |
ఆ బ్యాంక్ ఖాతాదారులకు గమనిక.. అక్టోబర్ 1 నుంచి చెక్ బుక్స్ పనిచేయవు..
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా బ్యాంక్‌లు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులలో పలు రకాల మార్పులు చేర్పులు ఉంటాయి. ఇందులో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు కొన్ని సూచనలు జారీ చేసింది.

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) పాత చెక్ బుక్స్ ఇక పని చెయవని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. ఇప్పటికీ ఆ బ్యాంక్ చెక్ బుక్స్ వాడుతున్న బ్యాంకు ఖాతాదారులు వెంటనే చెక్ బుక్స్‌ను మార్చుకోవాలని తెలిపింది. పాత చెక్ బుక్స్ 2021 అక్టోబర్ 1 నుంచి పని చేయవని, వెంటనే వాటిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్స్‌‌తో అప్‌డేట్ చేసుకొనిఅక్టోబర్ 1 నుంచి కొత్త చెక్ బుక్స్ మాత్రమే ఉపయోగించాలని సూచించింది.

దరఖాస్తు విధానం ఎలా ?

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) పాత చెక్ బుక్స్‌ని మార్చుకోవడానికి ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్‌బీ వన్, కాల్ సెంటర్ ద్వారా కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఈ క్రమంలో ఏవైనా సందేహాలు గనుక ఖాతాదారులకు ఉంటే వెంటనే 1800-180-2222 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. అంతే కాకుండా ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌‌తో కొన్న కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలని పాత ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తెలిపింది.



Next Story

Most Viewed