మీరు పర్మిషనిస్తే ప్రశాంతంగా ఏడుస్తాం : నుపూర్ సనన్

by  |
మీరు పర్మిషనిస్తే ప్రశాంతంగా ఏడుస్తాం : నుపూర్ సనన్
X

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కలిసి ‘రాబ్తా’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో కొన్నాళ్లపాటు వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. ఆ తర్వాత బ్రేకప్ అయిందన్న వార్తలు వినిపించాయి. అయితే నిన్న సుశాంత్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు ‘ఆయన మరణవార్త కలచివేసిందని.. డిప్రెషన్ కారణంగా చనిపోయిన సుశాంత్ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని’ కోరుకున్నారు. కానీ కృతి సనన్, తన సోదరి నుపూర్ సనన్ నుంచి ఎలాంటి పోస్ట్ రాకపోవడంతో నెటిజన్లు హరాజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది నుపూర్.

‘నిన్నటి నుంచి సోషల్ మీడియాలో సడెన్‌గా మెంటల్ హెల్త్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. సుశాంత్ మరణవార్తతో షాక్‌కు గురై నిరాశ, దుఃఖంలో ఉన్న తమను మరింత బాధపెట్టడం ప్రారంభించారు. ఎందుకు సుశాంత్ గురించి కనీసం పోస్ట్ కూడా పెట్టలేకపోయారు అంటూ ట్వీట్స్, మెసేజెస్, కామెంట్స్ చేయడం’ స్టార్ట్ చేశారు.

‘మీకు నిజంగా మనసు లేదు. ఇప్పటివరకు ఒక్క పోస్ట్ లేదు.. మీది ఎంత కఠిన హృదయం అంటూ అసభ్యంగా తిడుతున్నారు. ఇలాంటి మెసేజ్‌లు నిన్నటి నుంచి వస్తూనే ఉన్నాయి. ప్లీజ్ మీరు మాకు అనుమతిస్తే మా ఫ్రెండ్ గురించి కాస్త ప్రశాంతంగా ఏడవాలని ఉంది’. దయచేసి కొంచెం సమయం ఇవ్వమని కోరింది నుపూర్ సనన్.

View this post on Instagram

A post shared by Nupur Sanon (@nupursanon) on Jun 14, 2020 at 11:38pm PDT

Next Story