వృద్ధులు డబ్బు కోసం అక్కడికి వెళ్లక్కరలేదట.. ఎందుకంటే ?

by  |
amount
X

దిశ, వెబ్‌డెస్క్: వృద్ధులు, వికలాంగులకు భారత పోస్ట్ ఆఫీస్ ప్రత్యేకంగా పీపీఫ్, ఎస్ఈఎస్ఎస్‌ల విత్‌డ్రా చేసుకునే విధానాల్లో మార్పులను ప్రకటించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్(ఎస్ఈఎస్ఎస్)స్కీమ్‌లో ఉన్నవారు విత్‌డ్రా కోసం ఇకపై పోస్ట్ ఆఫీసుకు రావాల్సిన అవసరంలేదని ఓ ప్రకటనలో వెల్లడించింది. వీటితో పాటు అనుకోని పరిస్థితుల్లో అకౌంట్ మూసేయాలనుకునే ప్రక్రియల కోసం గతంలో తప్పనిసరిగా పోస్ట్ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. అయితే, తాజాగా 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు వయసు రీత్య పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పేర్కొంది. ఈ స్కీమ్‌లలో ఉన్నవారు ఖాతాదారులు నగదు తీసుకునేందుకు, ఖాతా మూసేసేందుకు వారి కుటుంబసభ్యులను పంపిస్తే సరిపోతుందని తెలిపింది. కుటుంబసభ్యులు డబ్బు విత్‌డ్రా చేసిన మొత్తాన్ని చెక్ రూపంలో కానీ, ఖాతాదారుడి పోస్ట్ ఆఫెస్‌కు చెందిన పొదుపు ఖాతాలో, బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు వెల్లడించింది.

Next Story

Most Viewed