నార్వే ప్రధానికి భారీ జరిమానా

by  |
నార్వే ప్రధానికి భారీ జరిమానా
X

ఓస్లో: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌‌కు భారీ జరిమానా విధించారు. గత నెలలో సన్నిహితులతో కలిసి ఆమె తన 60వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 13 మంది పాల్గొన్నారు. ఇది బయటకు పొక్కడంతో ఆవిడ క్షమాపణ కోరారు. కానీ ఫిజికల్ డిస్టెన్స్ రూల్స్ బ్రేక్ చేసి ఈ వేడుకలు జరిపినందుకు దాదాపు రూ.1.75 లక్షల జరిమానా (20వేల నార్వేజియన్‌ క్రోన్‌) విధించినట్లు నార్వే పోలీస్‌ చీఫ్‌ ఓలేసావెయరడ్‌ వెల్లడించారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రధానమంత్రే రూల్స్‌ పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రధానమంత్రిని కూడా విడిచిపెట్టకపోవడం వల్ల కొవిడ్‌ నిబంధనలు, ఆంక్షల అమలుపై సామాన్య ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని నార్వే పోలీసులు అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed