సైబర్ నేరాల బారినపడ్డ భారతీయులు.. లైఫ్ లాక్ నివేదికలో వెల్లడి

by  |
సైబర్ నేరాల బారినపడ్డ భారతీయులు.. లైఫ్ లాక్ నివేదికలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : ఇండియా డిజిటల్ గ్రోత్ పెరుగుతున్న కొద్దీ సైబర్‌ సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారుతోంది. గత 12 నెలల్లోనే పెద్ద సంఖ్యలో భారతీయులు హ్యాక్స్, ఐటెండిటీ థెఫ్ట్, ఇతర సమస్యలతో సహా కొన్ని రకాల సైబర్ క్రైమ్‌లను ఎదుర్కొన్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ లైఫ్‌లాక్ నివేదిక పేర్కొంది.

లాక్‌డౌన్ టైమ్‌లో నేరాలు తగ్గుముఖం పట్టగా, సైబర్ క్రైమ్స్ గణనీయంగా పెరిగాయి. నార్టన్ లైఫ్‌లాక్ తాజా నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. గతేడాది 27 మిలియన్ల ఇండియన్ అడల్డ్స్ ఐడెంటిటీ థెఫ్ట్‌కు గురి కాగా, మొత్తంగా 59 శాతం మంది ఇండియన్ అడల్ట్స్ సైబర్ క్రైమ్‌లను ఎదుర్కొన్నారు. సైబర్‌క్రైమ్ విక్టిమ్స్ (బాధితులు) ఈ సమస్యలను పరిష్కరించడానికి సమిష్టిగా 1.3 బిలియన్ గంటలు ప్రయత్నిస్తున్నారని నివేదిక పేర్కొంది.

లాక్‌డౌన్ వల్ల చాలా కంపెనీలు ‘రిమెట్ వర్క్’ ప్రొత్సహించాయి. దీంతో చాలామంది తమ వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ ఉపయోగించుకోగా, కొందరికీ కంపెనీయే వాటిని అరెంజ్ చేసింది. అయితే కంపెనీలో ఇవి సురక్షితం. కానీ రిమోట్ వర్క్‌లో అలా కాదు కదా. ఈ లూప్ లైన్‌ హ్యాకర్లకు వరంలా మారిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవడంతోనే సైబర్ క్రైమ్స్ పెరిగాయని నార్టన్ లైఫ్‌లాక్ సర్వేలో పాల్గొన్న ప్రతీ పది మందిలో ఏడుగురు అభిప్రాయపడ్డారు.

సైబర్ క్రైమ్స్ గురైన వారిలో 35 శాతం మంది కోపానికి ఒత్తిడికి లోనయ్యారని నివేదిక వెల్లడించగా, ప్రతి ఐదుగురిలో ఇద్దరు వీటి వల్ల భయపడ్డారని, తమకు ఏదైనా హాని కలుగుతుందని భావించారని సర్వేలో తేలింది. సైబర్ నేరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ 52 శాతం మంది ఇండియన్ అడల్ట్స్ సైబర్ క్రైమ్ నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియదని నివేదించారు. 68 శాతం మంది వారు ఆన్‌లైన్‌లో చూసే సమాచారం విశ్వసనీయమైన మూలం నుంచి ఉందో లేదో కచ్చితంగా తెలుసుకోవడం కష్టమని చెప్పారు. ఇదిలాఉంటే 46 శాతం మంది ఖాతా హ్యాక్ చేసిన సంస్థతో సంప్రదింపులు జరిపారు. 25 శాతం మంది స్నేహితుల హెల్ప్ తీసుకున్నారు. కేవలం 36 శాతం మంది మాత్రమే అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్‌ను డిటెక్ట్ చేసే ‘సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్స్’ కలిగి ఉన్నారు.



Next Story

Most Viewed