ప్రపంచానికి పెను సవాల్.. మరో సారి అణుపరీక్షలు చేసిన కిమ్..

213

దిశ, వెబ్ డెస్క్: కిమ్ మరోసారి అణు పరీక్షలకు పూనుకున్నాడు. ఎవరెన్ని చెప్పినా తగ్గేదే లేదు అన్న చందంగా వ్యవహరిస్తున్నాడు. కేవలం వారం వ్యవధిలోనే రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించి ప్రపంచం చేత మొట్టికాయలు తింటున్నాడు. ప్రస్తుతం ఉత్తర కోరియాలో ఆహార కొరత చాలా తీవ్రంగా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కాస్త వెనక్కి తగ్గుతాడు అని చూసింది అమెరికా. అంచనాలకు అందితే ఆయన కిమ్ ఎందుకు అవుతాడు.

అమెరికా అంచనాలను తల్లకిందులు చేస్తూ మరో సారి క్షిపణి పరీక్షలు చేశాడు. మెదటి పరీక్షల అనంతరం అమెరికా హెచ్చరించింది. ఈ సారి ఏకంగా కిమ్ రంగంలోకి దిగి ప్రత్యక్షంగా పరీక్షలను వీక్షించాడు. ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా పెంచుకుంటూ పోతుంటే.. పొరుగున ఉన్న దక్షిణ కొరియా, జపాన్ లలో అలజడి మొదలైంది. ఐక్యరాజ్య సమితి నిబంధనలు పదే పదే పెడచెవిన పెడుతున్న కిమ్ ను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ కిమ్ ఏ కోసానా లొంగడం లేదు.

అటు ఐక్యరాజ్య సమితి ఆగ్రహించినా, అమెరికా హెచ్చరించినా తాను మాత్రం మారే ప్రసక్తే లేదు అనేలా విరుచుకు పడుతున్నాడు. ప్రస్తుతం కిమ్ దుందుడుకు చర్యలకు ఎలా చెక్ పెట్టాలో తెలియక అమెరికా తలలు పట్టుకుంటోంది.