డ్యాన్స్‌ షోలో షాకింగ్ యాక్ట్.. కొరియో‌గ్రాఫర్‌ను నోరు మూసుకోమన్న జడ్జి 

by  |
Nora Fatehi
X

దిశ, సినిమా : హిందీ రియాలిటీ షో ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ 2’ తాజా ఎపిసోడ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ షోకు అతిథిగా వచ్చిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. దివ్య ఖోస్లా కూమార్‌తో కలిసి స్టేజిపై సెక్సీ బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టింది. తన మాస్ స్టెప్పులకు ఫిదా అయిన కొరియోగ్రాఫర్ టెరెన్స్ సైతం ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. వెంటనే కలగజేసుకున్న జడ్జి గీతా కపూర్.. ‘అంకుల్ కాసేపు మీరు నోరు మూసుకుంటారా?’ అనడంతో షో అట్మాస్పియర్ ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాదు షోలో భాగంగా టెరెన్స్, నోరా చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకెళ్లడంపైనా స్పందించిన గీత.. మరో జడ్జి మలైకాను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించింది.

అయితే ‘మలైకా ధరించిన డ్రెస్‌ను చూస్తూ నన్ను నేను మైమరిచిపోయాను’ అని టెరెన్స్ చెప్పడంతో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కాగా సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ 2’కు గీతా కపూర్, మలైకా అరోరా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక నోరా ఫతేహి ఇటీవలే ‘సత్యమేవ జయతే 2’లో కనిపించింది.


Next Story

Most Viewed