బంగారు వర్ణంలో మెరిసిపోతున్న బాహుబలి బ్యూటీ.. పిక్స్ వైరల్

by  |
nora fatehi
X

దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి తన గార్జియస్ లుక్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. గోల్డ్ కలర్ లెహెంగా, మ్యాచింగ్ బ్లౌజ్‌లో తళుక్కుమన్న ఐటం గర్ల్.. మెడలో పచ్చటి హారం ధరించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ అవుట్‌ఫిట్స్‌ను ‘సత్యమేవ జయతే 2’ సినిమాలోని ‘కుసు కుసు’ సాంగ్‌లో బెల్లీ డ్యాన్స్ కోసం ప్రముఖ డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించారు. ఆయన ఇదే విషయాన్ని వెల్లడిస్తూ తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో నోరా ఫొటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు ‘ఆమె రాణి కన్నా తక్కువేం కాదు’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. కాగా ‘టెంపర్, బాహుబలి’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నోరా రీసెంట్ సాంగ్ ‘కుసు కుసు’.. 92 మిలియన్‌కు పైగా వ్యూస్ సంపాదించడం విశేషం.



Next Story