తెలంగాణలో వారికి నో రేషన్, నో పెన్షన్..? డీహెచ్ క్లారిటీ..!

by  |
TE-GPVT1
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పెన్షన్ నిలిపివేస్తామని డీహెచ్ ఆదేశాలు జారీ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై కొద్దిసేపటి క్రితం డీహెచ్ శ్రీనివాసరావు స్పందించారు. అవన్నీ ఫేక్ వార్తలు అని కొట్టిపారేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావొద్దని సూచించారు.

అయితే, ప్రజల్లో మాత్రం దీనిపై గందరగోళం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ట్వీట్ ప్రకరాం.. ‘‘జిల్లాలో 100% #కోవిడ్ #వాక్సినేషన్ పూర్తి చేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల వారిగా ఎంత శాతం వాక్సినేషన్ పూర్తైందని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితా తయారు చేసి, వారికి వెంటనే ఆసరా పెన్షన్లు, రేషన్‌ను ఆపేయాలని అధికారులకు ఆదేశించారు.’’ అని ఉంది. దీంతో డీహెచ్ చెప్పింది నమ్మాలా? లేదా అని నెట్టింట ప్రశ్నిస్తున్నారు.

Next Story

Most Viewed