ఇష్టపడి పెళ్లి చేసుకుంటే జోక్యం చేసుకోలేం : కలకత్తా హైకోర్టు

by  |
ఇష్టపడి పెళ్లి చేసుకుంటే జోక్యం చేసుకోలేం : కలకత్తా హైకోర్టు
X

కోల్‌కతా : ఒక వయోజనురాలు తన అభీష్టం మేరకు పెళ్లి చేసుకుంటే అందులో ఎవరూ జోక్యం చేసుకోలేరని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. తన ఇష్టం మేరకే మతం మారినా అభ్యంతరపెట్టలేమని పేర్కొంది. తన కూతురిని మభ్యపెట్టారని, వేరే మతానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడని పేర్కొంటూ ఓ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించింది. తండ్రి కేసు పెట్టడంతో సదరు యువతిని పోలీసులు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు.

మెజిస్ట్రేట్ ముందు తన ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు. ఆమె భర్త కూడా కోర్టు ప్రాంగణంలో ఉండటంతో తన కూతురు నిర్భయంగా మాట్లాడలేకపోయిందని తండ్రి ఆరోపించారు. న్యాయమూర్తులు సంజీబ్ బెనర్జీ, అరిజిత్ బెనర్జీల డివిజన్ బెంచ్ ఈ వాదనలపై స్పందిస్తూ ‘ఒక వయోజనురాలు తన ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని, మతాన్ని మారాలని నిర్ణయించుకుంటే అందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు. ఆమె తన తండ్రి ఇంటికి రాకుండా ఉండాలని నిర్ణయించుకున్నా ఏం చేయలేం’ అని పేర్కొంది.

Next Story

Most Viewed