అలా చేస్తే తెలంగాణకు ఖచ్చితంగా పసుపు బోర్డు వస్తుంది : ఎంపీ అర్వింద్

by  |
Nizamabad MP Dharmapuri Arvind
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘‘పసుపు బోర్డు, మద్దతు ధర విషయంలో కేంద్రం స్పష్టతతో ఉంది. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టోలో మాత్రమే పసుపు బోర్డు అంశం ఉంది. కేంద్ర మ్యానిఫెస్టోలో మాత్రం లేదు. జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే అది ఖచ్చితంగా తెలంగాణకే వస్తుంది.’’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం నిజామాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పసుపు బోర్డుపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని, బోర్డు కంటే మేలైన పథకాలు అమలు చేస్తున్నామని కేంద్రమంత్రి పియుష్ గోయల్ చెప్పిన విషయాన్ని ఎంపీ అర్వింద్ గుర్తుచేశారు.

నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. పెద్దలు జానారెడ్డి తనకు తండ్రి లాంటి వారని అక్కడ జానారెడ్డి గెలిచినా, ఒడినా కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని అర్వింద్ అన్నారు. ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా.. దానిపై అధికార పార్టీ ప్రభావం, ప్రలోబాల పర్వం ఉంటుందన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు వేరని, తాము ఎమ్మెల్సీ ఎన్నికలలో దెబ్బతిన్నామని అంగీకరించారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కేసీఆర్ విసిరే బిస్కట్లు తినే కుక్కలు అని ఘాటుగా స్పందించారు. ఇప్పుడు వైఎస్ షర్మిలా వీసా తీసుకుని వచ్చి పార్టీ పెడుతుందా అని ప్రశ్నించారు. షర్మిల తెలంగాణలో మత మార్పిడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం అన్నారు. బెంగాల్‌లో బీజేపీ గెలవడం ఖాయం అని జోస్యం చెప్పారు.


Next Story

Most Viewed