హమాలీల కొరత లేకుండా చూడాలి: కాంగ్రెస్

by  |
హమాలీల కొరత లేకుండా చూడాలి: కాంగ్రెస్
X

దిశ, నిజామాబాద్: పంట కొనుగోళ్ల సమయంలో హమాలీల కొరత లేకుండా చూడాలనీ, కాంటా వేసిన సంచులను తొందరగా లోడ్ చేయాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మోహన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరుగు పేరుతో రెండు కిలోల కడతా తీసుకోవడం దారుణమన్నారు. సంచి బరువు ఎంతుంటే అంతే తీసుకోవాలి గానీ రెండు కిలోలు తీసుకోవడం సరికాదని తెలిపారు. ఈ విషయంలో మంత్రి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, రైతులకు రెండు రోజుల్లో డబ్బులు జమ చేయాలని విన్నవించారు.

Tags: Nizamabad, Congress leaders, grain buying center, Examined, minister

Next Story

Most Viewed