సవాళ్లను అధిగమించి ఆర్థిక వ్యవస్థ బౌన్స్ బ్యాక్ అవుతుంది : నీతి అయోగ్ ఛైర్మన్!

by  |
సవాళ్లను అధిగమించి ఆర్థిక వ్యవస్థ బౌన్స్ బ్యాక్ అవుతుంది : నీతి అయోగ్ ఛైర్మన్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 పరిణామాలను ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. మంగళవారం ఫిక్కీ ఈ-ఫ్రేమ్స్ కార్యక్రమంలో “దేశ నిర్మాణంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ పాత్ర” అంశంపై ప్రసంగించిన అమితాబ్ కాంత్… ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. అలాగే, వృద్ధి సాధించేందుకు, ఉద్యోగ కల్పనకు భారత్‌లో కీలకమైన 12-13 కీలక రంగాలను గుర్తించాలని అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రికల్ మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన టెక్నాలజీ, క్లినికల్ ట్రయల్స్‌ను సరళీకృతం చేయడం, ఔషధ పరిశ్రమలో విలువైన ఉత్పత్తులను కలిగి ఉండటం వంటివి దేశ వృద్ధి రేటు పెరగడానికి సహాయపడతాయని అమితాబ్ కాంత్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ గురించి వ్యాఖ్యానిస్తూ..ఆత్మ నిర్భర్ భారత్ అనేది దేశీయ మార్కెట్‌ను ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని’ అన్నారు

సృజనాత్మక పరిశ్రమల గురించి స్పందిస్తూ…మీడియా, వినోద పరిశ్రమల వృద్ధికి వేగవంతమైన మార్గాలున్నాయి. 2021 నాటికి ఇవి 30 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక, సృజనాత్మక ఎగుమతులు సైతం రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో రెట్టింపు అవుతాయని కాంత్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఈ-కామర్స్ సహా పలు సృజనాత్మక రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని కాంత్ తెలిపారు.

Next Story