రైతు సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం..

by  |
రైతు సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం..
X

దిశ,వెబ్ డెస్క్: రైతుల సమస్యల పరిష్కారానికి కొత్త వ్యవసాయ చట్టాన్ని తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గూడవల్లి వద్ద గల వ్యవసాయ క్షేత్రంలో రైతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సందర్బంగా ధాన్యం,చెరుకుకు గిట్టు బాటు ధర లేదని రైతుల ఆమెకు తెలిపారు. చెరుకు పంటకు బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని ఆమెతో రైతులు అన్నారు. క్వింటాల్ వరికి రూ.2వేలు ఇవ్వాలని రైతులు కోరారు. కాగా రైతులకు ఎదురయ్యే సమస్యలను తొలగించేందుకే చట్టం తెచ్చామని రైతులకు ఆమె తెలిపారు. చట్టం వల్ల కలిగే లాభాలను ఇతర రైతులకు వివరించాలని వారిని మంత్రి కోరారు.



Next Story

Most Viewed