మమతా లేఖపై స్పందించిన నిర్మల

by  |
మమతా లేఖపై స్పందించిన నిర్మల
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన మెడికల్ ఎక్విప్‌మెంట్లు, ఆక్సిజన్, ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా మాఫీ చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ధరలను అదుపులో ఉంచడానికి జీఎస్టీ విధిస్తున్నట్టు ట్వీట్ చేశారు. సీఎం మమతా పేర్కొన్న వాటిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ ఇప్పటికే మాఫీ చేసిందని గుర్తుచేశారు.

విదేశాల నుంచి వీటిని ఉచితంగా దిగుమతి చేసుకుని ఉచితంగా పంపిణీ చేస్తే వాటిపై పూర్తిస్థాయిలో మినహాయింపు వర్తిస్తుందని, ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాటిపై ఈ మినహాయింపు ఉన్నదని తెలిపారు. అయితే, దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నవాటిపై జీఎస్టీ మొత్తంగా ఎత్తేస్తే అవి ఇన్‌పుట్ సబ్సిడీలుగా పొందే మొత్తాన్ని కోల్పోయి రేట్లు పెంచడంతో అంతిమంగా వినియోగదారులపైనే భారం పడుతుందని వివరించారు.



Next Story

Most Viewed