త్వరలో మరో తమిళ్ ప్రాజెక్ట్ చేస్తున్న నిహారిక

by  |
త్వరలో మరో తమిళ్ ప్రాజెక్ట్ చేస్తున్న నిహారిక
X

మెగా డాటర్ నిహారిక కొణిదెల… ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి చిత్రాలు చేసినా అంతగా కలిసిరాలేదు. అయినా సరే నిహారికకు ఉన్న క్రేజే వేరు. కానీ వెబ్ సిరీస్ లు మాత్రం భలే కలిసి వస్తాయి నిహాకు. అందుకే వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని అనిపిస్తుంది. తన వెబ్ సిరీస్ లకు తానే ప్రొడ్యూసర్ కూడా. కానీ సినిమాలపై నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని… అందుకే వచ్చిన మంచి అవకాశాలను వదులుకోనని తెలిపింది. కానీ పెళ్లి అయ్యాక సినిమాలకు దూరంగా ఉంటానో లేదో అనేది ఇప్పుడే చెప్పలేనని… నేను సమంతను కాదు గా పెళ్లి అయ్యాక కూడా సినిమాలు కంటిన్యూ చేయడానికి… ఆ అదృష్టం అందరికీ ఉండదని చెప్పింది నిహారిక.

చివరగా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన నిహారిక… ఆచార్య లో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతుందని టాక్. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో నిహారిక నుంచి రొమాంటిక్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేక్షకులకు త్వరలోనే అలాంటి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపింది. తమిళ్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ ఎత్తి వేయగానే స్టార్ట్ అవుతుందని చెప్పింది. గోవాలో సినిమా షూటింగ్ ఉండబోతోందట.

Tags: Niharika, Mega Family, Mega daughter, Tollywood Kollywood

Next Story

Most Viewed