స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!

by  |
స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలను నమోదు చేశాయి. అయితే, ఈ లాభాలు స్వల్పమే కావడం గమనార్హం. ఉదయం ప్రారంభంలో వచ్చిన లాభాలు చివరి గంటలో తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో ప్రారంభంలో వచ్చిన లాభాలు మిడ్ సెషన్ అనంతరం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో లాభాలు స్వల్పానికి పరిమితమయ్యాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 86.47 పాయింట్ల లాభంతో 38,614 వద్ద ముగియగా, నిఫ్టీ 23.05 పాయింట్లు లాభపడి 11,408 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా మీడియా రంగం షేర్లు అత్యధికంగా ట్రేడవ్వగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, రియల్టీ రంగాలు లాభపడగా, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు కొంత క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా సెంటిమెంట్ బలపడటంతో మార్కెట్లు నష్టాల నుంచి తప్పించుకున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, నెస్లె ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.69 వద్ద ఉంది.


Next Story

Most Viewed