న్యూ ఇయర్‌కి నిఫ్టీ @14,000.. ఆల్ టైం రికార్డ్!

by  |
న్యూ ఇయర్‌కి నిఫ్టీ @14,000.. ఆల్ టైం రికార్డ్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కొత్త ఏడాది జోష్ కనబడింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రికార్డుల ర్యాలీ 2021 ఏడాది మొదటిరోజు కూడా కొనసాగింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు సాంకూలంగా ఉండటంతో పాటు కరోనా నియంత్రణకు ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.ఆటో, మెటల్, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో నిఫ్టీ తొలిసారిగా 14 వేల మార్కును దాటింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 117.65 పాయింట్లు లాభపడి 47,868 వద్ద ముగియగా, నిఫ్టీ 36.75 పాయింట్ల లాభంతో 14,018 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యధికంగా 3 శాతానికిపైగా పుంజుకున్నాయి. ఆటో, రియల్టీ, ఐటీ రంగాలు బలపడగా, ప్రైవేట్ బ్యాంకులు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌లో ఐటీసీ, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో షేర్లు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.08 వద్ద ఉంది.

Next Story

Most Viewed