బాణసంచా విక్రయించడం, కాల్చడంపై నిషేధం

by  |
బాణసంచా విక్రయించడం, కాల్చడంపై నిషేధం
X

దిశ, వెబ్‎డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి టపాకాయలు అమ్మడం, కాల్చడం పూర్తిగా నిషేధిస్తూ సోమవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి రాత్రి నుంచి నవంబర్ 31 వరకు ఎన్‎సీఆర్ పరిధిలో బాణసంచా కాల్చడాన్ని ఎన్జీటీ నిషేధించింది. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న అన్ని నగరాల్లో ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గ్రీన్ క్రాకర్స్ వాడేవారు మాత్రం పండుగ రోజు కేవలం రెండు గంటల పాలు టపాసులు కాల్చుకోవచ్చని ఎన్జీటీ ఆదేశించింది.

కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వాయు కాలుష్య తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎన్జీటీ పేర్కొంది.

Next Story

Most Viewed