రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో విచారణ

by  |
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీర్పును ఎన్జీటీ వాయిదా వేసింది. తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం మంగళవారం విచారించింది. 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులు ఎత్తిపోసేలా మార్పు చేశారని.. ఏపీ ప్రభుత్వ సమాచారం మేరకు కమిటీ లోపభూయిష్టంగా నివేదిక ఇచ్చిందని పిటిషనర్ తరుపు లాయర్ వాదించారు.

ఇదేమీ కొత్త ప్రాజెక్ట్ కాదని.. ప్రభుత్వం తరుపు న్యాయవాది వెంకటరమణి వెల్లడించారు. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పథకంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని తెలిపింది. ఈ పథకంపై తన అభిప్రాయాన్ని వారం రోజుల్లో తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. దీంతో తీర్పును వాయిదా వేసింది.

Next Story

Most Viewed