బిపిన్ రావత్ మరణ వార్త కలచి వేసింది.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

by srinivas |
industrial minister ap
X

దిశ, ఏపీ బ్యూరో: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌ మరణవార్త కలచి వేసిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి కీలక రక్షణ విభాగాలను ఒకే తాటి పైన నడిపించిన మార్గదర్శి రావత్‌ ని కోల్పోవడం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. శిక్షణ, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్‌, రిపేర్, మెయింటెనెన్స్ వంటి పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంలో ఆయన కృషి దేశం మరవదన్నారు.



Next Story

Most Viewed