బీచ్‌లో కొత్తజంట 'చెత్త పని'

by  |
బీచ్‌లో కొత్తజంట చెత్త పని
X

దిశ, వెబ్‌డెస్క్: నేటితరం తమ జీవితంలో మధుర ఘట్టంగా నిలిచే ‘పెళ్లి’ని సమాజానికి ఓ మంచి సందేశాన్నిచ్చే వేదికగా వినియోగించుకుంటున్నాయి. ఓ జంట తమ వివాహ మహోత్సవానికి అనాథలను అతిథులుగా ఆహ్వానిస్తే, మరో జంట తమ వివాహ మండపం మొత్తాన్ని పర్యావరణహితంగా డిజైన్ చేయించింది. కొన్ని జంటలు ఆహ్వాన పత్రికలుగా సీడ్ కార్డ్స్ పంచితే, మరికొన్ని జంటలు ఏకంగా మొక్కల్నే రిటర్న్ గిఫ్ట్‌గా అందించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రజెంట్ యంగ్ జనరేషన్ పెళ్లి వేదికగా చేస్తున్న మంచి పనులెన్నో. ఈ క్రమంలోనే తమ పెళ్లి తర్వాత సముద్రతీరాన్ని క్లీన్ చేసిన కర్ణాటకకు చెందిన ఓ యువ జంట.. అక్కడి పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, ‘ప్లాస్టిక్ ఫ్రీ బీచ్’ తమ లక్ష్యమని యువతకు సందేశమిస్తున్నారు.

కర్ణాటకలోని బైండూర్‌కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుదీప్ హెగ్డే.. తను ప్రేమించిన మినుషా కాంచన్ అనే అమ్మాయిని ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించుకునే సమయంలోనే పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అయితే ఎక్కడికి వెళ్లాలని డిసైడ్ చేయడానికి తాము ఎప్పుడూ కలుసుకునే సోమేశ్వర బీచ్‌కు వెళ్లారు. కానీ నిత్యం ప్రజలకు ఆహ్లాదం కల్పించే బీచ్‌లో చెత్త ఉండటాన్ని చూసిన అనుదీప్‌ ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయాయి. బీచ్‌లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, మందు సీసాలతో పాటు అక్కడున్న చెత్తను క్లీన్ చేయాలని ఆ క్షణమే డిసైడ్ కాగా, అదే విషయాన్ని తన భాగస్వామితో పంచుకున్నాడు. ఆమె కూడా అనుదీప్ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు హనీమూన్‌ను వాయిదా వేసుకుని మరీ బీచ్‌ను శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది. గత కొన్ని వారాలుగా బీచ్‌ను శుభ్రం చేసిన ఆ జంట, మొత్తంగా వారం రోజుల్లో 600 కిలోల చెత్తను సేకరించింది. కొన్ని రోజులుగా బీచ్‌లో చెత్త ఏరుతున్న వారి కృషిని చూసిన ఓ పదహారు మంది యువకులు కూడా వారితో జాయిన్ అయ్యారు.

‘ఈ పని ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఇద్దరం కలిసి కేవల ఒక వారంలోనే పెద్ద మొత్తంలో చెత్తను క్లీన్ చేశాం. మేము ఇద్దరమే ఇలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు? ఇందులో మరింతమంది భాగమైతే మనం మన పరిసరాలను ఎంతగా కాపాడుకోవచ్చో అర్థం చేసుకోండి. ఇదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ఇంకో వారంలో ఈ బీచ్ మొత్తం శుభ్రం చేసి, ఆ తర్వాత మా హనీమూన్ ప్లాన్ చేస్తాం. త్వరలోనే స్థానిక మత్స్యకారులకు కూడా దీనిపై అవగాహన కల్పించడంతో పాటు మూవీ నైట్ కూడా ఏర్పాటు చేస్తాను. అందులో భాగంగా సముద్ర జీవనం, సముద్ర, మూగ జీవాల పరిరక్షణ వంటి విషయాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తాను. స్థానిక ప్రజల్లోనూ దీనిపై అవగాహన రావడానికి అవేర్‌నెస్ డ్రైవ్స్ నిర్వహిస్తాను’ అని అనుదీప్ తెలిపాడు.

రాలిన ఆకుల నుంచి పేపర్

Next Story