కాసుల ఆట..మరి కరోనా ఎట్టా ?

by  |
కాసుల ఆట..మరి కరోనా ఎట్టా ?
X

ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన, ఖరీదైన ఆటల్లో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఈ నెల 29న ప్రారంభం కానుంది. అన్ని దేశాల్లోని క్రికెటర్లు ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఆడే ఆటగాళ్లను ఫ్రాంచైజీలు భారీ మొత్తం వెచ్చించి వేలంలో దక్కించుకుంటాయనేది తెలిసిందే. అయితే భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్ బాధితులు ఉన్నట్లు తేలడంతో ఐపీఎల్‌లో పాల్గొనే న్యూజిలాండ్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు పలు ఆంక్షలు విధించింది. ఈ మేరకు బోర్డు ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రిచర్డ్ బూక్ ఒక ప్రకటన విడుదల చేశారు. కివీస్‌కు చెందిన ఆరుగురు ఆటగాళ్లు ఐపీఎల్‌లో భాగంగా ఉన్నారని.. వారి ఆరోగ్యంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శ్రద్ధ తీసుకుంటోందని అన్నారు.

అభిమానులతో సెల్ఫీలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం, ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉన్న ప్రదేశాలకు వెళ్లడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. కాగా, విదేశీ ఆటగాళ్ల ఆరోగ్య రక్షణ విషయమై బీసీసీఐ తమతో సంప్రదించలేదని స్పష్టం చేశారు. అయినా సరే తమ ఆటగాళ్లను మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నట్టు రిచర్డ్ తెలిపారు.

tags : IPL, New Zealand, cricketers, board, Richard, March 29, BCCI

Next Story