మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ.. 1km వరుకు wi-fi

307
New Wifi Technology

దిశ, వెబ్‌డెస్క్ : సరికొత్త Wi-Fi టెక్నాలజీ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. Wi-Fi ని తదుపరి తరం వారు Wi-Fi HaLow గా పిలవనున్నారు. ఇది Wi-Fi నుంచి గుర్తింపు పొందింది. కొత్త Wi-Fi ఒక కిలోమీటరు వరకు కనెక్షన్‌లను అందించగలదని తెలుస్తోంది. అయితే ఈ Wi-Fi చాలా తక్కువ చార్జీంగ్ తోనే అందునుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)పై ఎక్కువ దృష్టి సారించి ఈ సరికొత్త సాంకేతికత అభివృద్ధి కనుగొన్నారు.

Wi-Fi HaLow పారిశ్రామిక, వ్యవసాయ, స్మార్ట్ బిల్డింగ్ అలాగే స్మార్ట్ సిటీస్‌లలో దీనిని అందుబాటులోకి తెవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త Wi-Fi HaLow.. సబ్-1GHz స్పెక్ట్రమ్‌లో పని చేస్తుంది. దీని ద్వారా ఏకకాలంలో 8,000 యూజర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం Wi-Fi 2.4GHz నుండి 5GHz వరకు రేడియో ఫ్రీక్వెన్సీల మధ్య ఉన్న Wi-Fi ఉపయోగిస్తున్నాం. అయితే ఇప్పుడ 1Ghz స్పెక్ట్రమ్ కంటే తక్కువ పని చేసేలా అభివృద్ధి చేశారు. ఈ కొత్త ఫీచర్ తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను అందిస్తుంది. అయితే ఈ Wi-Fi HaLow ఎప్పుడు వస్తుందనేది స్పష్టతా లేదు. 2021 Q4లో గుర్తింపు పొందిన తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని Wi-Fi అలయన్స్ తెలిపింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..