మరో మేడిన్ ఇండియా బాటిల్ గేమ్.. ‘సికో’

by  |
New Indian PUBG
X

దిశ, ఫీచర్స్ : బాటిల్ గేమ్స్‌లో పబ్‌జీ‌‌కి ఉన్న పాపులారిటీ మరే గేమ్‌కు లేదంటే అతిశయోక్తి కాదేమో. భారత గేమింగ్ మార్కెట్‌‌లోనూ నంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగిన‌ ఈ రాయల్ గేమ్‌‌ను ఇక్కడ నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘పబ్‌జీ’ని రీప్లేస్ చేసే లక్ష్యంతో ఇండియన్ గేమింగ్ మార్కెట్‌లోకి వచ్చిన ‘ఫౌజీ’ గేమ్‌కు అనుకున్నంత ఆదరణ దక్కలేదు. ఈ మేరకు పబ్‌జీ స్పేస్‌ను ఫిల్ చేయగల గేమ్ కోసం గేమింగ్ ప్రియులు ఇప్పటికీ ఎదురుచూస్తుండగా, సంబంధిత కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే పబ్‌జీకి పోటీగా మరో ఇండియన్ గేమ్ రాబోతోంది. ‘సికో’ పేరుతో రాబోతున్న ఈ గేమ్‌ వివరాలు తెలుసుకుందాం.

PUBG Mobile

బీహార్‌కు చెందిన ‘ఇండిక్‌ అరెనా’ అనే గేమింగ్ డెవలపర్ కంపెనీ ‘సికో’ అనే మల్టీప్లేయర్ మొబైల్ గేమ్‌ను రూపొందిస్తోంది. ‘స్పెషల్ ఇన్‌సర్జెన్సీ కౌంటర్ ఆపరేషన్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌‌ ఇటీవలే లాంచ్ కాగా, ప్రస్తుతం ఈ గేమ్‌ ప్రీ రిజిస్ట్రేషన్‌ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో మొదలైంది. పబ్‌జీకి ధీటుగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు భిన్నమైన మోడ్స్ ఇందులో ఉండటం విశేషం. దేవాలయాలు, వనం, పర్వత, మండప వంటి పేర్లతో కూడిన భూభాగాలు, నేపథ్య స్థానాలతో పాటు గేమ్‌లోని క్యారెక్టర్లకు కెప్టెన్ శౌర్య సింగ్, రుద్ర, అనా, శివ వంటి పేర్లతో ‘మేడ్ ఇన్ ఇండియా’ టచ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్‌తో ఈ గేమ్‌ ఆడుకోవచ్చు. అయితే ఈ గేమ్ ఎప్పుడు పూర్తిగా అందుబాటులోకి వస్తుందో మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. కాగా మల్టీపుల్ క్యారెక్టర్స్, అటాచ్‌మెంట్ సిస్టమ్, గ్రేట్ గ్రాఫిక్స్ విత్ ఇంటెన్స్ సౌండ్స్, హైలీ కస్టమైజ్డ్ కంట్రోల్స్, న్యూమరస్ గేమ్ మోడ్స్ వంటి ఫీచర్స్ ఈ గేమ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

SICO

మోడ్స్ :
టీమ్ డెత్ మ్యాచ్
ఫ్రీ ఫర్ ఆల్
గన్ రేస్
మల్టిపుల్ టీమ్ డెత్ మ్యాచ్
డామినేషన్



Next Story