వాట్సాప్ కొత్త ఫీచర్.. చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదివేయొచ్చు

910

దిశ, డైనమిక్ బ్యూరో : వాట్సాప్ ఇప్పుడు.. సమాచార వాహకంగా మారిపోయింది. ఎక్కడ ఏది చూసినా, ఏది జరిగినా వెంటనే వాట్సాప్‌లో షేరింగ్, స్టేటస్‌లు పెట్టడం ప్రతీ ఒక్కరూ చేసే పని. అంతేకాకుండా కొందరైతే వారికి తెలిసిన విషయం నిజమో కాదో.. నిర్ధారణ చేసుకోకుండానే పలువురికి షేర్ చేస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఒకరు పంపిన మెసేజ్‌ను ఓపెన్‌ చేయకుండా వాటిని చదవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ చాట్ ఓపెన్ చేయగానే బ్లూ టిక్ పడిపోతుంది.

అలా చాట్ ఓపెన్ చేయకుండా మెసేజ్ చూడాలంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మెసేజ్‌ను చూడొచ్చు. అయితే వాటిని కూడా పూర్తిగా చూడటం సాధ్యం కాదు.. అలాంటి వారికోసమే ఇది. దానికోసం మీరు మొదటగా.. మీ ఫోన్ హోం స్క్రీన్‌ డిస్‌ప్లేపై లాంగ్‌ ప్రెస్ చేస్తే మీకు పాప్‌-అప్‌ మెనూ కనిపిస్తుంది. అందులో విడ్జెట్స్‌ కేటగిరీపై క్లిక్ చేస్తే మీకు వేర్వేరు షార్ట్‌కట్స్ కనిపిస్తాయి. వాటిలో వాట్సాప్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే మీకు వేర్వేరు వాట్సాప్ విడ్జెట్స్‌ కనిపిస్తాయి.

వాటిలో 4×1 వాట్సాప్‌ విడ్జెట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే, దానిపై నొక్కిపట్టి హోం స్క్రీన్‌ మీదకి లాగాలి. అప్పుడు మీ ఫోన్ హోం స్క్రీన్‌ మీద వాట్సాప్ కనిపిస్తుంది. దానిపై లాంగ్ ప్రెస్‌ చేసి విడ్జెట్ ఎక్స్‌పాండ్ చేస్తే మీకు వచ్చే మెసేజ్‌లు కనిపిస్తాయి. అందులో వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లు కనిపిస్తాయి. వాటిని పైకి, కిందకి స్క్రోల్‌ చేస్తూ మెసేజ్‌ ఓపెన్ చేయకుండానే చదివేయొచ్చు. అయితే విడ్జెట్‌లో మీకు కనిపించే వాట్సాప్ మెసేజ్‌లపై క్లిక్ చేస్తే మాత్రం చాటింగ్ పేజ్‌ ఓపెన్ అవుతుంది. దాంతో మీరు మెసేజ్‌ చూసినట్లు అవతలి వ్యక్తులకు తెలిసిపోతుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..