గత 11 రోజుల్లో కొత్త కేసులు రెట్టింపు

by  |
గత 11 రోజుల్లో కొత్త కేసులు రెట్టింపు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని, గడిచిన 11 రోజుల్లో కొత్త కేసుల నమోదు రెట్టింపయ్యాయని కేంద్రం తెలిపింది. జనవరి 1న దాదాపు 20వేల కేసులు నమోదైతే, ఇప్పుడు వాటికి దాదాపు పది రెట్లకు మించి కేసులు రిపోర్ట్ అవుతున్నాయని వివరించింది. ఈ నెల 15 నుంచి ప్రతి రోజూ రెండు లక్షలకు మించి నమోదవుతున్నాయని, గడిచిన 11 రోజుల్లోనే కొత్త కేసులు 1.31 లక్షల(9వ తేదీ) నుంచి 2.73 లక్షల కేసులకు చేరి రెట్టింపయ్యాయని వివరించింది.

కరోనాపై పోరులో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకమని పేర్కొంది. ఈ ఆందోళనకర గణాంకాలను కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలు, పోలీసు చీఫ్‌లతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రస్తావించింది. ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, వీకే పాల్, డాక్టర్ బలరాం భార్గవ సహా పలువురు ఉన్నతాధికారులు యూటీలకు సూచనలు చేశారు. యూటీ ప్రతినిధులు తాము అమలు చేస్తున్న చర్యలను వివరించారు. బెడ్ల కొరత అంశాన్ని ఢిల్లీ లేవదీసింది. కరోనా కట్టడికి చర్యలు కఠినం చేయాలని, టెస్టులు పెంచాలని, అందులో ఆర్టీపీసీఆర్ టెస్టుల శాతాన్ని పెంచాలని కేంద్ర హోం శాఖ కారదర్శి తెలిపారు. కరోనాపై పోరులో వచ్చే మూడు వారాలు కీలకమని, ముందస్తు ప్రణాళికలు చేసి మహమ్మారిని నిలువరించాలని వీకే పాల్ చెప్పారు.

Next Story

Most Viewed