ధోనీ విరాళంపై దుమారం..

by  |
ధోనీ విరాళంపై దుమారం..
X

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోనీ.. కరోనాపై పోరాటానికి రూ. 1 లక్ష విరాళం ప్రకటించాడు. ఇప్పుడు అది నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతోంది. నెటిజన్లు సోషల్ మీడియాలో ధోనీని ఒక ఆట ఆడుకుంటున్నారు. సచిన్, గంభీర్ వంటి క్రికెటర్లు రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని అందిస్తున్నాడు. పీవీ సింధు కూడా తెలంగాణ , ఏపీ రాష్ట్రాలకు 5 లక్షల చొప్పున విరాళం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ధోనీ రూ. 1 లక్ష విరాళంగా ఇవ్వడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కాగా, ధోనీ ఆస్తి విలువ రూ. 800 కోట్ల వరకు ఉంటుంది. కొందరేమో.. 100 మందికి 21 రోజుల పాటు మూడు పూటల భోజనాల కోసం లక్ష ఇచ్చాడు. అంటే పూటకు 23 రూపాయలు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

కాగా, ధోనీపై వస్తున్న విమర్శలపై అతని భార్య సాక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ ఆ విరాళం ఎందుకు ఇచ్చాడో తెలుసుకొని వార్తలు రాయాలని మండిపడుతోంది. అయితే పుణేలోని ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాల సేకరణ చేపట్టగా.. ధోనీ దానిని ప్రారంభించి తొలుత ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు దానిపైనే విమర్శలు చెలరేగుతున్నాయి.

tags : MS Dhoni, Sakshi, Donation, Netizens, Negative comments



Next Story

Most Viewed