నెటిజన్ల ఫిదా.. ఫుడ్ డెలవరీ బాయ్‌కి అడ్రస్ ఇలా కూడా చెప్పొచ్చా..

by  |
నెటిజన్ల ఫిదా.. ఫుడ్ డెలవరీ బాయ్‌కి అడ్రస్ ఇలా కూడా చెప్పొచ్చా..
X

దిశ, వెబ్‌డెస్క్ : పలు సంస్థలు ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలవరీ చేస్తుండడంతో నగర, పట్టణవాసులు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా యూత్ వంట చేయడం, రెస్టారెంట్లకు వెళ్లడం మానేసి ఒక్క క్లిక్‌తో తమకు కావల్సిన ఫుడ్‌ను నిమిషాల వ్యవధిలో ఆర్డర్‌ను అందుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చాలామంది ఫుడ్ డెలవరీ బాయ్‌ల నుంచి ఆర్డర్‌ను తీసుకోవడం కష్టంగా మారుతుంది. సరైన లొకేషన్ తెలియక.. టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి.. ఫుడ్ డెలవరీ బాయ్‌కు అడ్రస్ ఎలా చెప్పాడో చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే..

అమెరికాకు చెందిన రెజినాల్డ్ ఫుడ్ డెలవరీ పెట్టుకున్నాడు. డెలవరీ బాయ్ రెజినాల్డ్ ఇంటి సమీపానికి వచ్చినా.. సరైన లొకేషన్ తెలియక ఆయనకు మెసేజ్ చేశాడు. రెజినాల్డ్ ఎంత వివరించినా ఇంటి అడ్రెస్ గుర్తించలేకపోయాడు. అప్పుడే రెజినాల్డ్‌కు ఫ్లాష్‌లా ఓ ఐడియా తట్టింది. తన దగ్గర ఉన్న ప్రకాశవంతమైన, మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లే లైట్‌ను ఉపయోగించి ఖచ్ఛితమైన అడ్రెస్‌ను చెప్పాడు.

రెజినాల్డ్.. నీలిరంగులో ఉన్న ఫ్లాష్ లైట్‌ను మొదట ఆకాశం వైపు ఫోకస్ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన ఇంటిపైకి లైట్‌ను మళ్లించాడు. ఆ లైట్‌ను అనుసరించి ఫుడ్ డెలవరీ బాయ్ రెజినాల్డ్ ఇంటిని తేలికగా గుర్తించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, డెలవరీ బాయ్, రెజినాల్డ్ మధ్య జరిగిన ఛాటింగ్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే 7.85 లైక్‌లు, 103 కు పైగా రీట్వీట్‌లు వచ్చాయి.

Next Story

Most Viewed